జనం న్యూస్ జూన్ 30 కోటబొమ్మాళి మండలం :ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులు ప్రైవేటు ఎరువులు దుఖాణాల్లో కూడా లభిస్తాయని, అయితే డీలర్లు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాడం జరుగుతుందని టెక్కలి వ్యవసాయ సహాయ సంచాలకులు కె. జగన్మోహన్ రావు హెచ్చరించారు. ఆయన మంగళవారం మండల కేంద్రంలోని పలు ప్రైవేటు ఎరువుల దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా, డీ.ఏ.పి ఎరువులను ఏ.పీ.ఏ.ఐ.ఎం.ఎస్ 2.0 యాప్ ద్వారా ప్రైవేటు ఎరువుల డీలర్లు రైతులకు విక్రయించాలని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి ఎస్. గోవిందరావు ఉన్నారు.