దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్, వేద సంకల్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారంభ పూజలు

జనం న్యూస్ జూలై 1 (రిపోర్టర్ రాజు) దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు వేద సంకల్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వజ్రకరూరు మండలం చిన్న హోతూరు గ్రామంలో మంగళవారం అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఊటుకూరు వెంకట్, సూర్యరత్నాల సూరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.వేద పండితులు జంగం శివశాస్త్రి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం 30 మంది చిన్నారులకు ఫలకాలు, బలపాలు అందజేసి విద్యారంభ పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డి, ఆర్. కిష్టయ్య, కుమారస్వామి, సుధాకర్, రామాంజనేయులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు వేద సంకల్ప సేవా ట్రస్ట్ నిర్వాహకులకు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ “జై శ్రీరామ్” నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *