అంగన్వాడి ఉద్యోగాలను దివ్యాంగులకు కేటాయించాలి

జనం న్యూస్ బోధన్ నియోజకవర్గం జులై 01, వికలాంగులకు పోరాట సమితి జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశం మాట్లాడుతూ ప్రభుత్వం వేసినటువంటి అంగన్వాడి ఉద్యోగాలను మా దివ్యాంగులకు కేటాయించాలని కోరారు ప్రభుత్వం పెళ్లి అయిన వారికి ప్రాముఖ్యత ఇవ్వడం సరైనది కాదు మా దివ్యాంగులను ఎవరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకునే టటువంటి పరిస్థితుల ఎవరు ముందుకు రారు అందువలన కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారిలో కొంతమందికి పెళ్లి కాలేదు. ఇప్పుడు ప్రకటించిన ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగాలైన మా దివ్యాంగులకు వస్తే వారికి ఉద్యోగం ఉందన్న నమ్మకంతో ఎవరైనా పెళ్లి చేసుకుంటారు మా దివ్యంగులకు పెళ్లి తోటి సంబంధం లేకుండా ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ముఖ్యంగా ప్రభుత్వానికి గుర్తు చేయడం మా దివ్యాంగులకు ఈ అంగన్వాడి ఉద్యోగాలలో అవకాశం కల్పించకపోవడం బాధాకరమని అదే విధంగా మా వికలాంగుల హక్కుల చట్టం 2016 91 ప్రకారం ప్రభుత్వాన్ని అన్ని శాఖలలో 5% ఉన్న దాని ప్రకారం మా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని లేకుంటే మా దివ్యంగులని చిన్న చూపు చూస్తే ప్రభుత్వం పైన ఎటువంటి ధర్నా చేయడానికి అయినా మేము వెనకంచి వేయమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *