ఉదిరిపికొండ గ్రామంలో, పి ఎం డి ఎస్ పంట పొలాల క్షేత్ర స్థాయి పరిశీలన.

*మండల వ్యవసాయ అధికారి శుభకర్..


జనం న్యూస్, కూడేరు, జులై2 రిపోర్టర్ ముంగ ప్రదీప్ మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి జి.శుభాకర్, ఏ పి సి ఎన్ ఎఫ్ సిబ్బందితో కలిసి గురువారం పిఎండిఎస్ రైతు సాగు చేసుకున్న పంట పొలాలను క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒకే పొలంలో మిశ్రమ పంటలుగా సాగు చేసిన కంది, గోరుచిక్కుడు, అనుములు తదితర పంటలను పరిశీలించారు. ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతుల ఆదాయ రక్షణ కోసం పీఎండ్స్ కింద మిశ్రమ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఒక పంటలో నష్టం సంభవించినా, ఇతర పంటల ద్వారా రైతులకు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వివరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ సాగుచేపట్టాలనిసూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శుభకర్, రైతు సేవ కేంద్రం సిబ్బంది, గ్రామంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.. పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *