జనం న్యూస్ జూన్ 26, (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమై ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పాలన ప్రజా రంజకంగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ముఖ్య అనుచరులు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కింద కూటమి నాయకులు చిత్తూరు జిల్లాలోని అతి పవిత్రమైన బోయకొండ గంగమ్మ ను దర్శించి మొక్కుబడి పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ కమ్మవారిపల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిమ్మల శ్రీధర్, బిజెపి మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డి, నిటిమామిడప్ప, కన్నా రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రవి మోహన్, బోయకొండ గంగమ్మ పంచాయితీ మాజీ సర్పంచ్ గంపల గంగరాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లక్ష్మీపతి, తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బిజెపి జిల్లా నాయకులు బొట్టు శ్రీనివాసులు తదితరులు శుక్రవారం బోయకొండ గంగమ్మను సందర్శించి కూటమి ప్రభుత్వ పేర్లను ప్రత్యేక పూజలు నిర్వహించారు.గోరంట్ల మండలానికి చెందిన కూటమి ప్రభుత్వ నాయకులు రాష్ట్రంలో రెండువేల ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాలన పైన ఆమె నాయకత్వంపై ఆనందం వ్యక్తపరుస్తూ మంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మంత్రి సవితమ్మకు దుష్ట శక్తులను దూరం చేసి మంత్రి సవితమ్మ మరో 30 ఏళ్లు మంత్రిగా కొనసాగాలని పార్టీ నాయకులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మల్లాపల్లి నరేష్ యాదవ్,సుబహన్, రోహిత్, మహేంద్ర, కమ్మవారి పల్లి బాలకృష్ణ, అమర్నాథ్ రెడ్డి, తలారి రఘు, వెంకటేష్, మురళి, నవీన్, గంగిరెడ్డి యాదవ్, అభిషేక రెడ్డి, సింగిరెడ్డిపల్లి శ్రీకాంత్, ఎర్రయ్య గారిపల్లి మహేంద్ర, కమ్మవారిపల్లి శ్రీనివాసులు, శివ, గంగరాజు, బూదిలి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.