జనం న్యూస్ జూన్ 27 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) రాష్ట్రంలోఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని కాపాడుకుందామని, గిరిజనేతరుల దాడిని తిప్పి కొడదామని చింతపల్లి డివిజన్ ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ ఐక్య వేదిక నినదించింది.ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ ఐక్య వేదిక ఆద్వర్యంలో కొయ్యూరు మండల కేంద్రంలో గల గిరిజన ఉద్యోగుల భవన్ లో నర్సీ పాపారావు అధ్యక్షతన సమావేశమై 1/70 భూభదాలయింపు నిషేధ చట్టం సవరణ చేయాలని 1700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్ట్ లో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ చట్టం సవరణ చేయకుండా ఏ విధంగా న్యాయ పోరటం, ప్రజాపోరాటం చేయాలో సమాలోచన చేసారు.1/70 చట్టం చేసిన తర్వాత అధికారులు సక్రమంగా అమలు చేయలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీ హక్కులు, చట్టాలు సక్రమంగా అమలు కాలేదని, బినామీల కారణంగా చట్టం ఆక్రమణకు గురౌవుతుందని, 1/70 చట్టం సవరణ చేయాలని గిరిజనేతరులు ఏకంగా సుప్రీంకోర్టు లో 1700 మంది కేసు వేయడం ఆశ్చర్యం గురి చేసిందని, ఇప్పటికే చాలామంది గిరిజనేతరుల దగ్గర ఆదివాసీల భూములున్నాయని, చట్టం సవరణ కానీ జరిగితే ఆదివాసీలం నిరాశ్రయులం అవుతామని,న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేయడానికి ఐక్యవేదిక ఆద్వర్యంలో గ్రామస్థాయిలోకి తీసుకొని వెళ్దామని, ఆదివాసీలందర్ని ఏకం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని, త్వరలో గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయం తీసుకొంది.ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య,మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకిపాటి వీరన్నపడాల్, భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు,విశ్రాంతి డిఎస్పీ కాకూరి బాలరాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్,చుండ్రు క్రిష్ణ,బూరుగుల వెంకటరావు, శ్యామల వరలక్ష్మి, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవుడు, కార్యదర్శి సాగిన కోటిబాబు,శామ్యూల్ పడాల్,సలుముర్తి సూరిబాబు, ఉల్లి సూరిబాబు, అశోక్ లాల్, అచ్యుత్,పాటి చంద్రశేఖర్, రాజుబాబు, గోకిరి చిన్నరావు, పల్లాల అబ్బాయిరెడ్డి, ముల్ల నాగరాజు, వంజరి శంకురమ్మ, డేపూరి రాజుబాబు, వారా చిననూకరాజులతో పాటు పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు.