జనం న్యూస్, కూడేరు జులై 2, రిపోర్టర్ ముంగ ప్రదీప్ గ్రామీణ పేదల సాధికారత, సమగ్ర సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్, ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (విబి జి రామ్ జి) పథకాన్ని గురువారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం. కూడేరు మండలంలో నిఅరవకూరు గ్రామపంచాయతీలో నిపనిప్రదేశంలో జిల్లాస్థాయిలో రాష్ట్రఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాలశాఖమంత్రివర్యులు పయ్యావుల కేశవ్ లాంఛనంగాప్రారంభించారు. అరవకూరు గ్రామ పంచాయతీలోని చెరువు కట్ట వద్ద కాలువలో కూడికతీత పనులను మంత్రి ప్రారంభించగా, మంత్రి స్వయంగా గడ్డపార పట్టి వికసిత్ భారత్ – జి రామ్ జి కింద ఉపాధి హామీ పనులు చేసి ఉపాధి హామీ శ్రామికులలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో ముచ్చటించారు. మీకు రోజుఎంతవేతనంవస్తుంది, వారికి అందుతున్న వేతనాలు, పనిదినాలు, కూలీ చెల్లింపుల విధానం, తదితర అంశాలను మంత్రి స్వయం గా అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల శ్రామికులకు సంవత్సరానికి 125 రోజుల వరకు మెరుగైన వేతనంతో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, కూలి చెల్లింపులు సకాలంలో వారి ఖాతాల్లో జమయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ పథకం గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేయడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకంను ఉపాధి హామీ శ్రామికులుఉపయోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, డ్వామా పిడి సలీమ్ భాష, ఏపీడి చెన్నకేశవులు, ఎంపీడీవో కుల్లాయి స్వామి, ఏపీవో పోలేరయ్య తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, మండల కన్వీనర్ చోళ సముద్రం మురళి, మండల ప్రధాన కార్యదర్శి గుండా శివయ్య, క్లస్టర్ ఇంచార్జ్ అరవకూరు ప్రసాద్, కూడేరు మాజీ ఎంపీటీసీ భాస్కర్ గౌడ్, బాటా వెంకటేశులు, బొమ్మయ్య, టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు రోలర్ నాగరాజు,డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం ఎం హళ్లి రాజు, గోటుకూరు ,గొల్ల వెంకటేశులు, శ్రీధర్ నాయుడు, ముట్టాల అక్కలప్ప, కరట్లపల్లి వెంకటప్ప, అరవకూరు గ్రామ ఉపాధి హామీ శ్రామికులు, మండల వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. విబిజిరామ్జి,పథకాన్నిప్రారంభిస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్. 2. శ్రామికులతో మాట మతి మంత్రి కేశవ్.3.