జనం న్యూస్ జూలై 02 నాగోల్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు క్రుషి చేస్తున్నా మణి సర్వ ప్రేమ సంక్షేమ సంఘం ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ సరిత అన్నారు. సర్వ ప్రేమ సంక్షేమం సంఘం అధ్వర్యం లో రూ. 1.35 లక్షల వ్యాయామంతో మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో దివ్యంగా విద్యార్థుల కోసం మరుగుదొడ్డి నిర్మించారు. గురువారం రోజున ఈ టాయిలెట్ బ్లాక్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు పేద విద్యార్థులు కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చెపదుతమన్నరు. మోహన్ నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, మోహన్ నగర్ ప్రధానోపాధ్యాయులు కట్టా ఆంజనేయులు మాట్లాడుతూ మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ధాతల సహకార్‌తో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాల అభివృద్దికి ముంధుకు వచ్ఛిన సర్వ ప్రేమ సంక్షేమ సంఘం వారికి దాన్యవాదములు తెలిపాయి. ఈ కార్యక్రమం లో సర్వ ప్రేమ సంక్షేమ సంఘం మేనేజర్ విజయ్, సమన్వయకర్త కస్పా రెడ్డి, కమ్యూనిటీ సామాజిక కార్యకర్త సౌజన్య, టీచర్ లూ సంధ్య, సునీత, అరుణజ్యోతి, శైలజ, అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు.