(జనం న్యూస్ ) మహబూబ్నగర్ జులై 02 :-పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప మాట్లాడుతూ,ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నిరాహార దీక్ష ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు చేపట్టిన ప్రజాస్వామ్య ఉద్యమమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మా బడుగు బలహీన వర్గాల నుంచి వివిధ రకాల పనులు పొంది మీరు విలాస భోగాలు పొందుతున్నారని మా డబ్బులను మాకు రియంబర్స్మెంట్ రూపంలో ఇవ్వడానికి మీకు మనసు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్లీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల ఆగ్రహానికి లోనవుతున్నారు. విద్యార్థుల ఆగ్రహం ఓట్లుగా మారితే పీఠాలు కదులుతాయి అన్నారు వీలైనంత తొందరగా 14 లక్షల విద్యార్థులకు సంబంధించిన తొమ్మిది వేల కోట్ల ప్లీజ్ రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 8 9 లను రద్దు చేయాలని అన్నారు. అధ్యాపకులు,విద్యార్థి సంఘాల సంఘీభావం చేశారు ఈ కార్యక్రమానికి యూనివర్సిటీకి చెందిన పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ,ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా విధానంపై స్పందిస్తూ, విధానాల కంటే వాటి అమలే ముఖ్యమని పేర్కొన్నారు. విద్యా సంస్కరణల పేరుతో తీసుకొచ్చే ప్రతి నిర్ణయం పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల చదువుకు భరోసా కల్పించాలే తప్ప,వారి ఆర్థిక భారం పెంచేలా ఉండకూడదన్నారు. “విద్యార్థికి అందుబాటులో లేని విధానం ఎంత ఆకర్షణీయంగా కనిపించినా అది ప్రజా విధానం కాదు” అని వ్యాఖ్యానించారు.