ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయాలని ఎరుకుల సంఘం వినతి

ఆదోని, జూన్ 29, జనం న్యూస్ రిపోర్టర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి : మహాభారత కాలం నాటి ధైర్యం, గురుభక్తి, త్యాగానికి ప్రతీక అయిన ఏకలవ్య విగ్రహాన్ని ఆదోని పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఎరుకుల సంఘం నాయకులు సోమవారం సబ్-కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గురుభక్తికి మారుపేరు ఏకలవ్య: ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, “మహాభారతంలో ఏకలవ్య చరిత్రకు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉంది. గురువు ద్రోణాచార్యుడిపై అపారమైన భక్తి, స్వయంకృషితో విలువిద్యలో సాధించిన నైపుణ్యం నేటి యువతకు ఆదర్శం. ఆయన చేసిన త్యాగం, పట్టుదల భావిత రాలకు స్ఫూర్తినిస్తాయి” అని అన్నారు. సంస్కృతి పరిరక్షణ కోసం విగ్రహం ఎరుకుల సమాజానికి ఏకలవ్య ఒక చారిత్రక, సాంస్కృతిక ప్రతీక అని తెలిపారు. ఆయన చరిత్రను భావితరాలకు పరిచయం చేసేందుకు ఆదోని పట్టణంలో అనువైన ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏకలవ్య జయంతి, వర్ధంతి సందర్భాల్లో నివాళులర్పిం చేందుకు శాశ్వత స్మారక చిహ్నంగా విగ్రహం ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎరుకుల సంఘం సమర్పించిన వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సబ్-కలెక్టర్‌ను కోరారు. సమాజ చరిత్ర, సంస్కృతిని పరిరక్షించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎరుకుల సంఘం నాయకులు మారుతి, మోపిరి సూరి, రవి, రామకృష్ణ, భీమేష్, కృష్ణ, రమేష్, సురేష్, వీరేష్, రఘు, మహేష్, వీరేంద్ర, అశోక్, బాలరామ్, సుకన్న, మెగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *