జనం న్యూస్ 30జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. వాంకిడి :కేజీబీవీ పాఠశాల సందర్శించిన చైర్మన్ విద్యార్థితో కలిసి భోజనం చేసిన తర్వాత బెడ్ షీట్లు పంపిణీ చేసి వారు మాట్లాడుతూ ప్రతి ఒక విద్యార్థి కష్టపడి చదువుకోవాలని భవిష్యత్తులో ఉన్నంత స్థాయిలో వెళ్లాలని సూచించారు పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా క్రీడల్లో కూడా రాణించాలని ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం రానున్న రోజుల్లో స్టూడెంట్స్ కిడ్స్ అందజేస్తున్నారని తెలియజేయడం జరిగింది కష్టపడి చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసైన విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా నీట్ ,ఐఐటి వంటి కోచింగ్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా మంచి కష్టపడి పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈవో శివ చరణ్,ఎస్ వో రైషా గారు, ,పాఠశాల సిబ్బంది మరియు మండల పార్టీ అధ్యక్షులు నారాయణ,సర్పంచ్ కృష్ణాజి, మేఘజి మరియు ఇతరులు పాల్గొన్నారు.