ఈనెల 28న ఆదివారం నాడు పోలియో చుక్కలు కేంద్రాల ద్వారా పోలియో చుక్కల పంపిణీ పంపిణీ…

బిజినపల్లి వైద్యాధికారి డాక్టర్ పి. సృజన..


జనం న్యూస్ జూన్ 27 ప్రతి నిది ఎండీ జహంగీర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28న ఆదివారం నాడు ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల వరకు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు ఆదివారం నాడు ఏర్పాటుచేసిన పోలియో కేంద్రాల ద్వారా ఉచితంగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బిజినపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో,బిజినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర, ప్రాథమిక పాఠశాల గాంధీ నగర్, ప్రగతి స్కూల్ పోలీస్ స్టేషన్ పక్కన, శాయిన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర,మహాదేవుని పేట గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, మమ్మయిపల్లి ప్రాథమిక పాఠశాలలో, వట్టెం గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర,వెలుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర,పోలేపల్లి ప్రాథమిక పాఠశాల దగ్గర, మొబైల్ టీం ద్వారా బోయపూర్ ,ఆన్ కాన్ పల్లి తండా,ఇతర తండాలు , ఇటుక బట్టిలు , గుడిసెలలో పర్యవేక్షకులు,ఆశా కార్యకర్తలు,సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసిన వాహనంలో వచ్చి తప్పనిసరిగా అర్హులైన వారికి పోలియో చుక్కలు వేస్తారని ఆమె తెలిపారు. పుట్టిన బిడ్డ నుండి అయిదు సంవత్సరాలు వయసున్న వారందరూ తప్పనిసరిగా ఆదివారం నాడు పోలియో చుక్కల మందు ఉచితంగా వేయించుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలకు పర్యవేక్షకులు అశోక్ గారిని సెల్ లో 9490927816 కు సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *