రెబ్బెనలో 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న 250 కుటుంబాలకు పట్టాలివ్వాలి

*జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే కోవ లక్ష్మి వినతి.

జనం న్యూస్ 30జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. రెబ్బేన :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో 70 ఏళ్లుగా ఇళ్లు, దుకాణాలు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న 250 పేద కుటుంబాలకు రెగ్యులరైజేషన్ పట్టాలు మంజూరు చేయాలని గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. 2007లోనే జాయింట్ సర్వేలో ఈ 7 ఎకరాల 20 గుంటల భూమి రెవెన్యూ శాఖదిగా తేలిందని, అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇదే వారికి జీవనాధారం. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ఫీజు చెల్లించడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారు. మానవతా దృక్పథంతో పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలి” అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. వారితో పాటు రెబ్బెన దుర్గం భరద్వాజ్ మాజీ ఉప సర్పంచ్ బొమ్మినేనీ శ్రీధర్ , కనగాల మాణిక్యరావు , తక్కలపల్లి రాజేశ్వరరావు, ఇందూరి రవీందర్,రాయళ్ల కృష్ణ, కొండగొర్ల శ్రీనివాస్, బొమ్మినేనీ వెంకటరమణ, హస్ముఖ్ లాల్ నివాస మరియు దుకాణ వాసులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *