అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు వై.సి.పి నేతలకు లేదు.

జనం న్యూస్ జూన్ 29 కోటబొమ్మాళి మండలం :రాష్ట్రంలో అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు వై.సి.పి నేతలకు లేదని రాష్ట్ర కళింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు అన్నారు. సోమవారం అయినా ఇక్కడ ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. అందులోనూ టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మాట్లాడటం మరింత హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఎవరో కళ్ళు లేని కబోజులు తప్ప చూపు ఉన్న ఎవరు అభివృద్ధి కోసం మాట్లాడలేరన్నారు. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు టెక్కలి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొంతమంది నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారని, ఇంకా విమర్శలు చేస్తే అమరావతిలో వైసీపీ నేతలకు జరిగిన గతే ఇక్కడ నేతలకు జరకక తప్పదని హెచ్చరించారు. గత ఐదేళ్లు వారు అధికారంలో ఉండి ఏం చేశారు చెప్పాలని గోవిందరాజులు డిమాండ్ చేశారు. గడచిన రెండేళ్లలో ఈ గ్రామం వెళ్ళిన అభివృద్ధి అంటే ఏమిటో గ్రామాలే చెబుతాయి అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని నాయకులకు అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు, అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం, అధినేత మెప్పుకోసం ఇక్కడ కులాలను రెచ్చగొడుతూ దుర్భాషలాడుతూ మాట్లాడితే అందరికీ కులాలు ఉన్నాయని, అందరూ కులాల కోసం మాట్లాడగలరని, అయితే తెలుగుదేశం పార్టీ విజ్ఞత, విధేయతలకు లోబడి క్రమశిక్షణతో కూడిన పార్టీ కావడం వలన కొంత ఆలోచన చేస్తుందని, మేము కూడా నోరు ఎత్తితే ఏమైనా మాట్లాడగలమని గోవిందరాజులు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని, ఇష్టారాజ్యంగా మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని ఆయన హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *