జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూలై 01 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. గుడిపల్లి హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్న ప్రియాంక ఈ గుడిపల్లి ప్రాంతం లో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం అని డాక్టర్స్ డే నా డాక్టర్ ప్రియాంక చెప్పింది. వైద్య వృత్తి మరుపురానిది ప్రజల కు వైద్య సేవలు అందించడం ఎంతో సంతోషం అని చెప్పింది. సీజనల్ వ్యాదుల పై అప్రమత్తంగా ఉండాలని , వైద్యో నారాయణ హరి అని ఉరికే అనలేదు అని పగలు రాత్రి తేడాలేకుండా వైద్య సేవలు చేస్తున్నామని తెలిపింది. డాక్టర్ బెంగాల్ రెండవ సి ఎం బి ధాన్ చంద్ర రాయ్ జయంతి నీ ఏటా డాక్టర్స్ డే గా నిర్వహిస్తున్నారని డాక్టర్ ప్రియాంక తెలిపింది.