జనం న్యూస్ జూన్ 25, రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపారు. మండలంలో గుమ్మలపాడు గ్రామం పారమ్మ చెరువు వద్ద యువకులతో గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత మత్తు పదార్థాలకు ఎక్కువగాబానిసవుతున్నారన్నారు. వాటికి బానిస కాకుండా యువత దేశానికి నిదర్శనంగా నిలవాలని చెప్పారు. రానున్న రోజుల్లో ఎలక్షన్ సమయంలో యువత ఎటువంటి పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలంటే తెలిపారు. అలా కాదని ఎవరైనా తప్పుదావ పట్టి గొడవలు అల్లర్లు నిర్వహించిన ఎడల వారిపై కఠిన చర్యలు నిర్వహిస్తామన్నారు. యువత ఈ దేశానికి పట్టుకొమ్మలని తెలిపారు. ఎవరైనా అలా తప్పుదోవ పట్టిన యెడల తమకు సమాచారం తెలపాలని కోరారు. అనంతరం యువకులచే మత్తు పదార్థాలకు బానిస కాము దేశాన్ని అభివృద్ధిలో నడుపుతాం అని నినాదంతో ప్రతిజ్ఞచేయించారు.అంతకుముందు యువకులతో క్రికెట్ ఆడి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది దేవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.