రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు

(జనం న్యూస్-జూన్ 26 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) మునగాల మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఎదుట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి స్థానిక యువకుడు మచ్చ ఉపేందర్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనను చూసి చలించిపోయిన ఆయన,స్థానికుల సహకారంతో వానరానికి గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతంగి విజయ్‌కుమార్, మచ్చ శంకర్, కొండమీద చిన్న గురవయ్య, రాఖి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *