జనం న్యూస్ 3/7 టేక్మాల్ ( ప్రతినిధి ) దిశ, పాపన్నపేట: ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో గాయాలపాలై యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాపన్నపేట గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం… యూసుఫ్ పేట గ్రామానికి చెందిన తుడం నాని(22) అదే గ్రామానికి చెందిన అర్కెల చిన్నతో కలిసి బైక్‌పై అరికెల గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పాపన్నపేట గ్రామ శివారులోకి రాగానే ఎదురెదురుగా మరో బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్ వెనకాల కూర్చున్న నాని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి శివారులో బుధవారం సాయంత్రం రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. అతన్ని వెంటనే 108 వాహనంలో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.