జనం న్యూస్ 2026 జూలై 3 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్ ) జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు విజయవంతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.మెదక్ జిల్లా చరిత్రలో జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1.08 లక్ష మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతులు దిగుబడులుపండించారని,జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తి అయిందన్నారు. రైతుల అకౌంట్లలో రూ.1005.66 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు.1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసి ఏప్రిల్ 08 న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు జూన్ 27వ తేదికి పూర్తి చేశామన్నారు.
జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఏసీఎస్ -305, ఐకేపీ-185, డీసీఎంఎస్- 43 కేంద్రాల్లో కొనుగోలు జరిపామన్నారు.జొన్నలు కొనుగోలు చేస్తాం జిల్లాలో జొన్న రైతులు ఎలాంటి ఆందోళన గురి కావద్దని, జొన్నల కొనుగోళ్ల గురించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. శుభ్రంగా ఉన్న జొన్నల్ని కొరడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 3609 ముందు రైతుల నుండి 6347 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా సివిల్ సప్లై అధికారి. నిత్యానందo, సివిల్ సప్లైమేనేజర్ జగదీష్ ,జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ రావు, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు, పాత్రికేయులు పాల్గొన్నారు.