వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది ఈడీ పద్మావతి

జనంన్యూస్ 02 జులై 2026 మొయినాబాద్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నాడు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అధికారి పద్మావతి గారిని ఘనంగా సన్మానించారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రంగారెడ్డి జిల్లా సభ్యులు బేగరి రాజు, కొంకాని విజవ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, భారత రాజ్యాంగ పీఠికను మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి గారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదలకు, వెనుకబడిన వర్గాలకు మరింత సహాయం అందించేందుకు కృషి కొనసాగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరి, కుమార్, కుమ్మరి శ్రీనివాస్, ఉప్పరి సందీప్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *