జనం న్యూస్ జూన్ 30 మంథని, టౌన్ రిపోర్టర్ (కుంట పోశెట్టి )ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని 2026–27 సంవత్సరానికి సంబంధించిన 47వ నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మంగళవారం మంథనిలోని ఎంఎంఆర్ బ్యాంకెట్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా మాజీ గవర్నర్ (PDG) డాక్టర్ ఆర్. విజయ ఇన్‌స్టాలేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడిగా లయన్ మేడగోని వెంకటేష్, కార్యదర్శిగా లయన్ ముస్కుల లోకేందర్ రెడ్డి, కోశాధికారిగా లయన్ మందల మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా పెండ్రు సుమంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి జిల్లా కేబినెట్ కార్యదర్శి లయన్ వొల్లాల కృష్ణహరి, జిల్లా కేబినెట్ ట్రెజరర్ లయన్ కొల్లూరి ఆనందం, రీజియన్ చైర్‌పర్సన్లు లయన్ రేకులపల్లి శశాంక, లయన్ కావేటి రాజగోపాల్, జోన్ చైర్‌పర్సన్లు లయన్ సదుల వెంకటేశ్వర్లు, లయన్ వెల్పుల రమేష్, లయన్ బెల్లంకొండ జైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మేడగోని వెంకటేష్ మాట్లాడుతూ సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తూ విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. సభ్యుల సహకారంతో క్లబ్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.