జనం న్యూస్ జూన్ 29 మంథని టౌన్ రిపోర్టర్ (కుంట పోశెట్టి) ఈరోజు మంథని నియోజక వర్గం, పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారిందని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామానికి చెందిన రేణిగుంట్ల నగేష్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈ నెల 10న ఎంపీవో దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. వీధి కుక్కలు గ్రామ ప్రజలపై దాడులకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నాయని, పాడి పశువులపై కూడా దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని, కుక్కల బెడదను నివారించి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని జిల్లా అధికారులను నగేష్ కోరారు.