వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు..

*కరుణించవా.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులు

(జనం న్యూస్-జూలై 02 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్)- మృగశిర కార్తె ముగిసినా.. ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఆకాశంలో కారు మబ్బు లు లేవు. తొలకరి వర్షంతో పులకరించిన రైతన్న వానకాలం సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో పత్తి,ఇతర పంటల విత్తనాలు భూమిలో విత్తారు. భూమిలో విత్తనాలు విత్తిన తర్వాత వర్షం ముఖం చాటేయడంతో రైతన్నలు వర్షం కోసం ప్రతిరోజూ ఆకాశం వైపు చూసున్నా వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో రైతన్న కన్నీరుమున్నీర వుతున్నాడు. ఎల్‌నీవో శాపంతో నైరుతి రుతుపవనా లు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. గతేడాది వానకాలంలో జూరాలకు ముందస్తు వరదలు రావడంతో రైతులు సంతోషంతో సాగుకు సిద్ధమై వర్షాలపై ఆధారపడకుండా పంటలు సాగు చేశారు.ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని తొలకరి వర్షానికి రైతులు ఎవరూ పంటలు సాగు చేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచించినప్పటికీ రైతులు అక్కడక్కడ పావుల వంతు భూమిలో విత్తనాలు విత్తారు. విత్తనాలు విత్తని రైతులు అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. విత్తిన రైతులు సాగు కోసం ఖర్చు చేసిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరేనా అని లోలోన మదనపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *