లారీ – ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి.మహాదేవపూర్ స్థానిక పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రోజు లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం, TS 07 UN 6147 నంబర్ గల లారీని డ్రైవర్/నిందితుడు: ఓరగంటి సాయికుమార్ ఇబ్రహపట్నం, రంగారెడ్డిజిల్లా నడుపుతూ వస్తుండగా, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అత్కారి వినీత్ , గ్రామం గుమ్మడిపల్లి, మహారాష్ట్ర అతనికి తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.సమాచారం అందుకున్న మహాదేవపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చనిపోయిన వ్యక్తికి భార్య 2 సంవత్సరాల పాప ఉంది. హైదరాబాద్ లో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతారు..గర్భం తో ఉన్న భార్య ను చూడటానికి హైద్రాబాద్ నుండి ఇంటికి బైక్ మీద వచ్చే క్రమంలో ఇట్టి ఆక్సిడెంట్ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *