అంబేద్కర్ నగర్‌లో నీటి బోర్ ప్రారంభం

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 02 మంథని (టౌన్ రిపోర్టర్ కుంట పోశెట్టి )మంథని మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో ప్రజల నీటి సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన నీటి బోర్‌ను మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి పాలకవర్గ సభ్యులు ప్రతిక్షణం అందుబాటులో ఉంటారని అన్నారు.*ప్రజలు తమ సమస్యలను పాలకవర్గ సభ్యుల దృష్టికి తీసుకువస్తే, వాటిని పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపడతామని చైర్మన్ గారు తెలిపారు.*ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి గారు, నాయకులు జంభోజు సమ్మయ్య గారు, స్థానిక మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *