
జనం న్యూస్ సెప్టెంబర్ 02మసాయి పేట్ ప్రతినిధి మొహమ్మద్ ముజామిల్ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దుబ్బాక మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి 7 వ వర్ధంతిని పురస్కరించుకుని చేగుంట మండల కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తా లొ నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టి నాయకులు పాల్గొని వైఎస్సార్, చెరుకు ముత్యం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్, ముత్యం రెడ్డి,చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ముత్యం రెడ్డి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయి పేట్ శ్రీనివాస్, మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సండ్రుగు సతీష్, వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, జిల్లా నాయకులు జుకంటి రాజా గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు,అన్నం ఆంజనేయులు , బల్ రెడ్డీ, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్,వివిధ గ్రామాల అధ్యక్షులు, సినియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.