ఆర్ ఓ ఆర్ ప్లాంట్ తయారు చేయాలని వినతి

🖨️ Print

జనం న్యూస్ 3 సెప్టెంబర్ 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా:మండలం లోని ఏ. కోడూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆర్ఓఆర్ ప్లాంట్ చెడిపోయి 15 రోజులు కావస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతూ బుధవారం నాడు మండల వ్యవసాయ కార్యదర్శి డేవిడ్ ఆధ్వర్యంలో ఏవో శ్యామలమ్మ కు వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంట్ త్వరగా రిపేర్ చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విన్నవించారు. తాగునీటి సమస్య తీర్చడంలో పంచాయితీ అధికారులు గ్రామ సర్పంచ్ లేనందున ప్రత్యేక అధికారి నియమించిన ఆయన పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపించారు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజు వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రామచంద్రుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *