9బిసి విద్యార్థి వసతి గృహాల అదనపు నిధులకు సానుకూలముగా స్పందించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2 (కరీంనగర్ రిపొర్టర్ కడారి అయిలయ్య)9బిసి విద్యార్థి వసతి గృహాల మిగులు పనుల నిమిత్తం ఈరోజు హైదరాబాదు తెలంగాణ సచివాలయంలో బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను 9 కుల సంఘాల ప్రతినిధులు కలిసి విద్యార్థి వసతి భవనాలను పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకురావడానికి నిధులు సమకూర్చమని మంత్రిని కోరడం జరిగింది. మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డికి రికమండేషన్ లెటర్ పంపించడం జరిగింది. త్వరలో విద్యార్థి భవనాల అభివృద్ధి పనుల నిమిత్తం బడ్జెట్ విడుదల చేయిస్తామని వారు హామీ ఇచ్చినారు. ఇట్టి కార్యక్రమంలో 9బీసీ కుల సంఘాల చైర్మన్ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు మోసం అంజయ్య, కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె రాజు, నాయి బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ సింగిరాల వెంకటస్వామి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్, ఉపాధ్యక్షులు తమ్మనవేణి నర్సయ్య యాదవ్ జంగమ సంఘం జిల్లా అధ్యక్షులు కిన్నర సురేష్, పూసల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి శ్రీనివాస్, గాండ్ల సంఘం జిల్లా అధ్యక్షులు పోసు కృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కం వేణు మాధవ్ తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *