జనం న్యూస్ మధిర జూన్ 28, దోర్నాల కృష్ణ మధిర మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో నేడు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ రంగా రూపా శ్రీనివాస్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
ఈ సందర్భంగా 21వ వార్డు కౌన్సిలర్ రంగా రూపా శ్రీనివాస్ మాట్లాడుతూ,చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకం. ప్రతి తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని రెండు చుక్కలతో చిన్నారులు జీవితాంతం వికలాంగత్వం నుంచి కాపాడవచ్చని ఆరోగ్యవంతమైన భావితరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గజ్జలకొండ స్వరూప రాణి అంగన్వాడీ టీచర్ కటారపు ప్రశాంతి ఆశా వర్కర్ జ్యోతి పాల్గొన్నారు.