జనం న్యూస్ తూప్రాన్, జూన్ 28 తూప్రాన్ ఉమ్మడి మండలంలో ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు వైద్య అధికారులు ఏర్పాట్లు చేశారు గ్రామపంచాయతీ భవనాలు,పాఠశాల భవనాలు, బస్టాండ్ లో పోలియో చుక్కలు వేసే సెంటర్లను ఏర్పాటు చేశారు బయట నివాసాలు ఉండే వారి కోసం మొబైల్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఐదు సంవత్సరాలు కలిగిన పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని వైద్య అధికారులు తల్లిదండ్రులకు సూచించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పల్స్ పోలియో క్యాంపు నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.