జనం న్యూస్ జూన్ 30 పుల్లంపేట వైయస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మడగలం శ్రీనివాసులు. …ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఎల్ ఆర్ .వల్ల వైయస్సార్ సిపి పార్టీలోని ఎస్సీ, బిసి ముస్లిం, రెడ్లు అర్హత గల ఓటర్లను, తటస్థ అనుకూల ఓటర్లను రఘురామరాజు చేసిన వ్యాఖ్యలను వింటుంటే పథకం ప్రకారం తొలగించే ప్రమాదం ఉందని వైయస్సార్సీపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మడగలం శ్రీనివాసులు గారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణాలలో సర్ మందకోడిగా జరుగుతున్నాయి. 2002 సంవత్సరం లొ తమ ఓట్ హక్కు వినియోగించుకొని ప్రస్తుతం ఇతర రాష్ట్రాలలో,ఇతర జిల్లాల్లో నివాసముంటున్న ఉన్న చాలామందికి వారి స్థానికత అడ్రస్ ప్రూఫ్ తదితర గత వివరాలను చెప్పే నాథుడే కరువయ్యారు. అదే సమయంలో జీవించి ఉన్న ఓటరు జాబితాలో పేర్లు లేని వారి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం 2026 సం లొ వారి సంతానానికి వారి తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రాలు ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన ఆందోళన చెందారు.అలాగే కొత్తగా వివాహం జరిగి ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలలో నివాసముంటున్న వారికి ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమగ్ర ప్రత్యేక నివేదిక ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు కాని వారికి భవిష్యత్తులో భారత పౌరసత్వం, పాస్పోర్ట్ తదితర ధ్రువపత్రాలు కోల్పోయే ప్రమాదం ఉందని అయన వివరించారు.ఈరోజు మంగళవారం పుల్లంపేట మండలంలోని కొమ్మన వారి పల్లె, అనంతంపల్లి ,జానకిపురం, రంగంపల్లి, రెడ్డిపల్లి గ్రామాలలో గల పోలింగ్ బూతులలో జరిగిన సర్ కార్యక్రమంలో మడగలం శ్రీనివాసులు, మండల బూత్ లెవెల్ అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి బిఎల్వోలు, బిఎల్ఎ లు, వైసిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.