ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన ఐదుగురి కి జైలు శిక్ష

జనం న్యూస్ జూన్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండలప్రతినిధి శివశంకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన నా ఐదుగురి కి జైలు శిక్ష అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం నెహ్రూ నగర్ చెందిన తగరం ముత్యాలరావు కెమిలా ఎయిడ్స్ ఫ్యాక్టరీ లోపనిచేసేవాడు అతని భార్య శ్యామల అదే గ్రామానికి చెందిన తగరం వెంకటేశ్వరరావు తో వివాహేతర సంబంధం పెట్టుకుంది అంతేకాదు ప్రియుడుతో కలసి భర్తను మానసికంగా హింసించింది దీనితో మనస్థాపం చెందిన తగరం ముత్యాలరావు 2018 జూలై 31న కెమిస్ట్ కర్మాగారం వెనుక ఉన్న మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తాను ఆత్మహత్య చేసుకోవడానికి తన భార్య శ్యామల తో పాటు ఆమె ప్రియుడు తగరం వెంకటేశ్వర్లు అతని అన్నయ్య తగరం పుల్లారావు తండ్రి తగరం రామారావు తల్లి నరసమ్మ అనువారునా చావుకి కారణం అని సూసైడ్ నోట్లో రాసినాడు మృతుని భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు గాను పలు మార్లు పంచాయతీలు చేసినటువంటి నారాయణపురం గ్రామానికి చెందిన ఇంకా 9 మంది పై కేసు నమోదు అయినది దీని ప్రకారం ఆనాటి ఎస్సై వేల్పుల వెంకటేశ్వరరావు 14 మందిపై సి ఆర్ నెంబర్ 178 బై 2018 అండర్ సెక్షన్ 306 రెడ్ విత్ 34 ఐపిసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినారు ఆనాటి నుండి ఇప్పటివరకు వాదాపు వాదనలు అనంతరం ఈ కేసులో నిందితులైన శ్యామలకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావుకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అతని బంధువులు తగరం పుల్లారావుకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రామారావు నరసమ్మలకు మూడు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు నిందితులందరికీ కూడా ఒక్కొక్కరికి 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ కొత్తగూడెం అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కవిత బుధవారం తీర్పును వెలువరించినారు నిందితులకు శిక్ష పడడంలో అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు ఎస్సై మధు ప్రసాద్ అశ్వరావుపేట కోర్టు కానిస్టేబుల్ బి నాగేశ్వరరావు అశ్వరావుపేట కోర్టు కానిస్టేబుల్ ప్రశాంత్ అను పోలీస్ అధికారులు అందరూ కలిసి ఈ కేసులో పురోగతి సాధించి నిందితులకు శిక్ష పడేలా చేసినందుకు గాను మృతుడు తగరం ముత్యాలరావు ఆత్మకు శాంతి చేకూరిందని అతని తల్లి తగరం తిరుపతమ్మ ఈరోజు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులకు ఘనంగా శాలువాలతో సన్మానం చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా కొందరికి శిక్ష పడాల్సి ఉందని వారిపై జిల్లా కోర్టులో అప్పిలికి వెళతానని ఆమె తెలియజేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *