నిద్రపోతున్న దొరమామిడి టూ అలివేరు రోడ్డు

*రోడ్డు తవ్వి 4 నెలలు పూర్తి - వాహనదారులకు జేబులు చిల్లు *గుడ్డివాడి చేతికి రాయిచ్చినట్లు - సోమరిపోతులకు పదవులెందుకంటున్నా ప్రజలు

జనం న్యూస్ /జూన్ 28/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ :సోమరాజు నడపాల దొరమామిడి నుండి అలివేరు వరకు రోడ్డు నిర్మాణం చేయడానికి 4 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి 4నెలల క్రితం ముందున్న రోడ్డుని తవ్వారు.ఆ నాటి నుండి నేటి వరకు వాహనాలు అడుగడుగున పంచర్లు పడుతున్నాయి.జేబులకు చిల్లులు పెడుతున్నాయి.రోడ్డు తవ్విన నాటి నుండి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు తవ్విన రోడ్డు గుండా నిరంతరం తిరుగుతున్నారే తప్ప పట్టించుకున్న దాఖలాలే లేవు.ఇంకెప్పటికీ రోడ్డు పూర్తి కాదేమోనని స్థానిక ప్రజలు వాపోతున్నారు.ఎన్ని వందల కిలో మీటర్లో అందుకే పూర్తి కావడం లేదంటున్న ప్రజలు.ఈ రోడ్డు గుండా ప్రమాధాలు కూడా అధికమవుతున్నాయని,రోడ్లు తవ్వి అన్ని నెలలు ఉంచకూడదని,మీడియా ముందు ప్రజలు పడుతున్న అవస్థలు తెలుపుకున్నారు.రోడ్డు త్వరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.రోడ్డు కోసం పట్టించుకోకపోతే ప్రభుత్వ హై కామాండ్ కి పిర్యాదు చేయవలసి వస్తుందని ఈ సందర్బంగా తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *