జనం న్యూస్ జూన్ 27 ప్రతినిది, ఎండీ జహంగీర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాల, పాలెంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జ్ అసోసియేట్ డీన్ డా. వి. అనిత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కృష్ణయ్య (సహాయ ఉప నిరీక్షకుడు) నరసింహ (పోలీసు కానిస్టేబుల్) శివశంకర్ రెడ్డి (పోలీసు కానిస్టేబుల్) అంకిత (పోలీసు కానిస్టేబుల్)హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. వి. అనిత, ఇన్‌చార్జ్ అసోసియేట్ డీన్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం సహాయ ఉప నిరీక్షకుడు కృష్ణయ్య మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, చట్టపరమైన పరిణామాలను వివరించి, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి బాధ్యతను తెలియజేశారు. కానిస్టేబుళ్లు శ్రీ నరసింహ, శివశంకర్ రెడ్డి విద్యార్థులకు మత్తు పదార్థాల నివారణ, యువత సామాజిక బాధ్యత మరియు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. కార్యక్రమ అధికారి వి. రమ్య, డా. ఎం. భానుశ్రీ ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అతిథులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు మరియు సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.