నర్మాల గురుకుల పాఠశాల విద్యార్థులు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

*రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక ఫంక్షన్ హాల్లో

జనం న్యూస్/ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నర్మాల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు సిరిసిల్లలో గల పద్మనాయక ఫంక్షన్ హాల్ యందు జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులుప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *