జనం న్యూస్ / గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఆక్సి్ఫర్డ్ స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం నేటి సమాజంలో తీవ్రమైన సమస్యగా మారిందని, ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడడం వల్ల వారి ఆరోగ్యం, విద్య భవిష్యత్తు మరియు కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల కు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ కు నొ చెప్పండి – జీవితానికి యెస్ చెప్పండి డ్రగ్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, నేరాల పెరుగుదల మరియు కుటుంబాలపై పడే ప్రభావాల గురించి ప్రజలకు వివరించారు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్సి్ఫర్డ్ స్కూల్ ప్రధానో పాధ్యాయులు సంతోష్ రెడ్డి, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.