జనం న్యూస్ ప్రకాశం జిల్లా దోర్నాల మండలం రిపోర్టర్ బీ వివేక్ ఈ నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్యాకేజీల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో గంటవానిపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రచ్చబండ కార్యక్రమ స్థలాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి టూర్ కోర్డినేటర్ రవి తేజ మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ హర్ష వర్ధన్ రాజు ఐపీఎస్ ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు & కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం డీఎస్పీ నాగరాజు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు వెలిగొండ ప్రాజెక్ట్ ఎస్‌ఈ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ, ప్రజల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు