జనం న్యూస్ జూన్ 25, (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ సహాయ కార్యదర్శి భూక్య సురేందర్ పి.స్వరూప మాట్లాడుతూ ఖానాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోవడం దూర ప్రయాణాల్లో ఉండటం వలన సరి అయిన సమయానికి చదువుకొని విద్యార్థులకు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిం చవలసిన బాధ్యతను మరిచి ఇష్టానుసారంగా విధులు నిర్వహించడం వల్ల గ్రామాలలో చాలా ఇబ్బందులు ఏర్పడు తున్నాయి స్థానికంగా విధులు నిర్వహించే విధంగా జిల్లా అధికారులు ఎంపీడీవో చర్యలు చేపట్టాలని ఎం సి పి ఐ యుజిల్లా కమిటీ గా డిమాండ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా సమైక్య జిల్లా నాయకులు పద్మ .సంధ్య.రూప తదితరులుప్రకటించారు.