దూస్‌కల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నోట్‌బుక్స్ పంపిణీ.

జనం న్యూస్ 02 జులై 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలంలోని దూస్‌కల్ గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ (ఎఫ్ సి ఎన్), షాద్‌నగర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ పీఆర్‌వో శ్రీను తొంట చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు సుమారు 850 నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఈ నోట్‌బుక్స్‌ను చదువులో సద్వినియోగం చేసుకుని కష్టపడి అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రేవతి, ఉపాధ్యాయులు సంతోష్ బాబు, శ్రీనివాస్, సర్ఫరాజ్ అన్వర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలలకు కొనసాగించాలని కోరారు. సమాజ సేవ పట్ల వారి నిబద్ధతను ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *