జనం న్యూస్ 30 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎన్నుమరేషన్ ఫారాలను పూరించడంలో సహకరించాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మొదట చేపడుతున్న ఇంటింటి సర్వేను బిఎల్ఓలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.
మంగళవారం గద్వాల పట్టణ పరిధిలోని 21వ వార్డు 233, 234 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిఎల్ఓలు ప్రతిరోజూ తమ పరిధిలోని ఇంటింటికి తిరిగేందుకు ప్రణాళిక రూపొందించుకొని, నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఫామ్ ను స్కాన్ చేశాకే ఓటర్లకు ఇవ్వాలని సూచించారు. ఎన్నుమరేషన్ ఫారాలను పూరించడం లో బూత్ లెవెల్ ఏజెంట్లు, స్థానిక యువత ఓటర్లకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు ఇండ్లను సందర్శించి ఓటర్లకు ఎన్నుమరేషన్ ఫారాలను అందజేశారు.ఈ పర్యటనలో స్థానిక కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్, మ గద్వాల తహసిల్దార్ హరికృష్ణ సూపర్వైజర్ వెంకటేశ్వర్ రెడ్డి బిఎల్ఓ శాంతమ్మ బిఎల్ఎలు తదితరులున్నారు జారీ చేయువారు డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా