జనం న్యూస్ జూన్ 30 ప్రతినిది ఎండీ జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా వికలాంగుల పలు సమస్యలు మరియు జిల్లాలోని దివ్యాంగుల కమిటీ హాల్ నిర్మాణం కు కొరకు సోమవారం నాడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వికలాంగుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నారం దాస్ శ్రీశైలం కలెక్టర్ కు వినతి పత్రంను అందజేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నిరుద్యోగ వికలాంగుల సమస్యలు పరిష్కరించుటకు మరియు వారి వినతులను వినుటకు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జూలై నెల 14న దివ్యాంగుల సమస్యల గురించి సమావేశాన్ని నిర్వహించి దివ్యాంగులతో వినతిపత్రములు స్వీకరిస్తానని, వికలాంగుల సమావేశంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాములు, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు మంతటి శేఖర్, తాడూరు మండల అధ్యక్షులు కొప్పునూరు సైదులు, బిజినపల్లి మండలాధ్యక్షులు ఎద్దుల వెంకటస్వామి మరియు షేరీ కాశన్న, కృష్ణాజి, వడ్డేమాన్ రాజేష్, రామ్మోహన్, నరేష్, అంజి రెడ్డి, ఆంజనేయులు తదితర దివ్యాంగులు పాల్గొన్నారు.