జనం న్యూస్ జూన్ 30 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామ పంచాయతీలో వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు, లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా విత్తనాలను అందజేశారు.కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా వైసిపి మండల అధ్యక్షులు డౌనూరు ఎంపిటిసి బిడిజన అప్పారావు అగ్రికల్చర్ అసిస్టెంట్ శశాంక్ అధ్వర్యంలో నేమాని నూకలమ్మ మాజీ సర్పంచ్, నీలాపు సూరిబాబు అర్ టి ఐ విభాగం మాట్లాడుతూ గిరిజన (ఎస్టీ) రైతులకు ప్రత్యేక రాయితీ ఐటిడిఎ పరిధిలోని మరియు గిరిజన ప్రాంతాల్లోని గిరిజన రైతులకు ప్రభుత్వం ఏకంగా 90% వరకు ప్రత్యేక సబ్సిడీ లేదా ఉచితంగా విత్తనాలను అంద జేస్తోంది.లబ్ధిదారులైన రైతులకు స్థానిక రైతు సేవా కేంద్రాల (అర్ బి కె ఎస్) ద్వారా ఈ-పంట (ఇ-క్రాప్) నమోదు ఆధారంగా ఈ విత్తనాలను నేరుగా పంపిణీ చేస్తున్నారు. కూటమి నాయకులు స్వామి నాయుడు,వార కొండలరావు,దారబాబు వైసిపి నేతలు పెట్ల గాంధీ, జూనియర్ వార నూకరాజు కొండలరావు(పండు) ఉల్లి రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.