చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ కలయిక..!

జనం న్యూస్ 25 జూన్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బుధవారం రాత్రి కేకేఆర్ కన్వెన్షన్ హాల్ లో 10వ తరగతి క్లాస్మేట్, చిన్ననాటి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి కుమార్తె సారీ సెర్మిని కార్యక్రమం సందర్భంగా పాత మిత్రులు ఎంతో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్నేహ బంధాలను మరింత బలపరుచుకున్నారు. ఈ శుభకార్యానికి హాజరైన స్నేహితులు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, చిన్నారికి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. “కాలం మారినా… స్నేహం మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే భావనను ఈ కలయిక మరోసారి గుర్తు చేసింది. ఈ కార్యక్రమంలో స్నేహితులు మొహమ్మద్ సమి, నరసింహులు, సురేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, బాలకిషోర్, నవీన్, రాజు, ఈశ్వర్, శ్రీనివాస్, వేణుగోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *