(జనం న్యూస్-జూన్ 25 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మునగాల మండల కేంద్రంలో రాష్ట్రవ్యాప్త జన చైతన్య బైక్ యాత్ర నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి సేవించడం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్య నష్టాలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సమాజ కార్యకర్త, ఉపాధ్యా యుడు రాచకొండ ప్రభాకర్ సూచించారు.