(జనం న్యూస్-జూన్ 25 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో 6, 7వ తరగతులతోపాటు ఇంటర్ మొదటి సంవత్సరంలోని సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వీరబాబు తెలిపారు. అర్హులైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో పాఠశాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.