చాగపురం దళితులపై దాడి చేసిన అగ్రకులస్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి

జనం న్యూస్ 30 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కురుమన్న జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా యస్ సి యస్ టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇటిక్యాల మండలం చాగపురం గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా గ్రామంలో ఏరువాక తోరణం తెంపే సమయంలో దళితులు పాల్గొన్నకూడదని కొంతమంది అగ్రవర్ణ అహంకారంతో కులం పేర మతం పేర పోలీసుల సమక్షంలోనే చట్టాన్ని తుంగలో తొక్కి చర్నకోలతో గొడ్డును బాదినట్లు బాది దళితులపై దాడి చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి జోగులాంబ గద్వాల జిల్లా యస్ సి యస్ టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కురుమన్న డిమాండ్ చేశారు దళిత మహిళా సర్పంచ్ పరిపాలనలో కూడా ఈ విధంగా జరగడం దుర్మార్గమన్నారు గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా దళితులకు భరోసా కల్పించే విధంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి దళితులపై దాడి చేసిన వారిని వెంటనే తరలించాలి భవిష్యత్తులో మరే గ్రామంలో ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *