జనంన్యూస్ జూన్ 27 ఎలిగేడు మండలం శుక్రవారము రోజున ర్యాకల్ దేవ్ పల్లి గ్రామములో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమములో మండల తాహసీల్దార్ యాకన్న పాల్గొని బి ఎల్ వో లు ఎస్ ఐ ఆర్ జాబితాను పారదర్శకంగా నిర్వహించాలి అని బి ఎల్ వో లకు తగు సూచనలు చేసారు . ఓటరు చేర్చుటకు ఫారం 06 ,ఓటరు తొలగింపునకు 07 ఇవ్వాలని తెలిపారు . ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ రమాదేవి సంపత్ ,ఉప సర్పంచ్ బొడిగె శివకృష్ణ గౌడ్ ,బి ఎల్ వో ఓదేశ్వరి తదితరులు పాల్గొన్నారు.