అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ మధిర జూన్ 26, దోర్నాల కృష్ణ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మధిర పరిధిలోని షేర్ చేయూత డి అడిక్షన్ సెంటర్ లో సి గోపాలరెడ్డి వారి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మధిర జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు మరియు సమాజ సేవ వైపు దృష్టి సారించాలని సూచించారు.డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలు నాశనమవడంతో పాటు చట్టపరంగా కూడా తీవ్రమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు మరియు ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయ విద్యార్థులు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *