జనం న్యూస్, 27 జూన్ 2026, భీంగల్ మండల ప్రతినిధి తోపారం సురేందర్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జూలై 12 ఆదివారం రోజున నిర్వహించనున్న “ఊర పండుగ” కు హాజరు కావాలని భీంగల్ సి.ఐ. పొన్నం సత్యనారాయణ గౌడ్, స్థానిక ఎస్సై తిరుపతి, స్టేషన్ సిబ్బందిని ఆహ్వానించినట్లు సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పతాని కృష్ణ, తీగల రఘు, కోశాధికారి ఎస్పీ భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి నిచ్చెమొల్ల రాజేశ్వర్ కమిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9 సంవత్సరాల అనంతరం ఘనంగా నిర్వహిస్తున్న ఊర పండుగలో పాల్గొని గ్రామదేవతల ఆశీస్సులు పొందగలరు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరె నాగమణి స్వామి, వైస్ చైర్ పర్సన్ సంటి లత జే.జే. నర్సయ్య, ఒకటవ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, కౌన్సిలర్లు పర్స కుశలత అనంతరావు, తోట సతీష్, బొదిరె నరసయ్య, నీలం రవి, మలావత్ సంగ్యా నాయక్, మామరి సందీప్, మల్లెల అనుపమ ప్రసాద్, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సలహా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.