ఉచిత యోగ శిబిరం నిర్వహించబడును

*తపోవన యోగా కేంద్రం రి. నెం1481/2017"కోటి సూర్య నమస్కారాల ప్రపంచ రికార్డు -2027 లక్ష్యంగా ప్రతి గ్రామంలో ఉచిత యోగ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎలిగేటియెలిగేటి కృష్ణ అన్నారు

జనం న్యూస్ / గంభీరావుపేట 02 జూలై రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల KG టు PG ప్రాంగణంలో 2026 జూలై 3 (శుక్రవారం) నుండి జూలై 7 (మంగళవారం) వరకు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటల నుండి 7:00 గంటల వరకు ఉచిత యోగ శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ యోగ శిబిరంలో బీపీ, షుగర్, ఊబకాయం (ఒబెసిటీ), మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, ఒత్తిడి (స్ట్రెస్) తదితర ఆనా రోగ్య సమస్యలను యోగాభ్యాసం ద్వారా నియంత్రించుకునే విధానాలపై ఉచిత శిక్షణ అందించబడుతుంది. కోటి సూర్య నమస్కారాల “ప్రపంచ రికార్డు స్థాపనలో మన గ్రామం కూడా భాగస్వామి అవుదాం” అనే లక్ష్యంతో గ్రామంలోని ప్రతి వార్డు నుండి మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరూ ఈ ఉచిత యోగ శిబిరంలో పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా కో-ఆర్డినేటర్ యేలిగేటి కృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ విజయవంతం చేసి అధిక సంఖ్యలో పాల్గొనాలని గంభీరావుపేట సర్పంచ్ మల్లుగారి పద్మ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు మల్లుగారి నర్సగౌడ్ ,యోగా శిక్షకుడు పెరిమెల్లి దేవయ్య,కరాటే మాస్టర్ విక్రమ్, మార్నింగ్ వాకర్స్ మిత్రులు సుంకోజు రమేష్,దేవసాని కృష్ణ,కామిడి సంజీవ రెడ్డి,నాగరాజు, దోసల శంకర్,ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *